Friday, February 23, 2024

Nirmal – ప్ర‌మాదంలో క‌డెం ప్రాజెక్ట్ – తెగి ప‌డిన‌న 15వ నెంబ‌ర్ వ‌ర‌ద గేటు

నిర్మల్ జిల్లా. కడెం సెప్టెంబర్ 26 ప్రభా న్యూస్. నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ మళ్లీ ప్రమాదంలో పడింది. కడం ప్రాజెక్ట్ ఎక్కువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు మూలంగా జలాశయంలో ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుకు చెందిన రెండు వరద గేట్లు ఎత్తివేసి గోదావరిలో నీ టిని వదిలారు . కాగా ఇన్ ఫ్లో వరద నీరు రావడం తగ్గడంతో మంగళవారం ఎత్తిన రెండువరద గేటుల లో ఒక వరద గేటుకు కిందికి దించి వరద గేటు మూసి వేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా 15వ నెంబర్ వరద గేటు కౌంటర్ వెయిట్ తెగి నీటిలో ప‌డింది .

వరద గేటు రోపు తెగిపోవడంతో గేటు వరద నీటిలో పడిపోవడంతో నీరంతా వృధాగా వెళుతుంది ఇటీవల వర్షాకాలంలోగత జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండడం దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు కడం జలాశయంలో వచ్చి చేరడంతో కడెం ప్రాజెక్టు వరద గేట్ల పైనుండి నీరు వెళ్లడంతో ఆ సమయంలో ప్రాజెక్ట్ దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలకు అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం అందరికీ తెలిసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement