Tuesday, October 8, 2024

KNR: ప్రత్యేక ఆకర్షణగా వరల్డ్ కప్ గణపతి

గణపతి నవరాత్రి ఉత్సవాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరల్డ్ కప్ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణనాథుడి మండపం ముందు క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్న విధంగా సెటప్ ఏర్పాటు చేశారు.

వరల్డ్ కప్ 2023 నమూనాతో గణనాథుడిని ప్రతిష్టించి గత వారంరోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ వైభవ్ గైక్వాడ్ మాట్లాడుతూ… తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, అందుకే వరల్డ్ కప్ 2023 నమూనాతో గణనాథుడి మండపం ఏర్పాటు చేసి పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement