Friday, April 26, 2024

ఏపీలో పరీక్షలు ఎప్పుడు రద్దు చేస్తారు?: నారా లోకేష్

ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి‌ నారా లోకేష్‌ డిమాండ్ చేశారు. బుధవారం ఆయ‌న వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఏపీలోనూ పరీక్షలు రద్దు చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించి.. సీబీఎస్ఈ పరీక్షలపై చర్చించి రద్దు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని గుర్తు చేశారు. కోవిడ్ థ‌ర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ 12 ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశారని తెలిపారు. ప్ర‌ధాని మోదీకి స‌మీక్ష నిర్వ‌హించ‌డానికి  స‌మయం ఉంది కానీ సీఎం జ‌గ‌న్‌కు లేదా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌కుండా వాయిదా వేస్తూ వెళ్తున్నార‌ని లోకేష్ మండిప‌డ్డారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం మంచి నిర్ణ‌యం తీసుకోవాలని కోరారు. లక్ష‌లాది మంది పిల్ల‌ల ప్రాణాల ర‌క్ష‌ణ‌కు సీఎం, మంత్రులు పూచీ ఇవ్వ‌గ‌ల‌రా? అని ప్రశ్నించారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, టీచ‌ర్ల ప్రాణాల ర‌క్షణ కోసం న్యాయ‌పోరాటం కొన‌సాగిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement