Saturday, May 4, 2024

Nara Bhuneswari – కుల దేవ‌త‌ల‌కు ప్ర‌త్యేక పూజాలు… అత్త‌మామ‌ల స‌మాధి వ‌ద్ద నివాళులు

నారావారిపల్లెలో తమ కులదేవతలైన గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి.. అనంతరం అత్తమామలు ఖర్జూర నాయుడు, అమ్మణమ్మ సమాధుల వద్ద నివాళులు అర్పించారు. ఆమె ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లిలో గ్రామస్తులు, మహిళలు భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేసిన వారు… త్వరలో మంచి జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు.

ఇది ఇలా ఉంటే నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తో తీవ్ర వేదనకు గురై మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని టీడీపీ వెల్లడించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement