Sunday, April 28, 2024

AP: నారావారిప‌ల్లెలో నంద‌మూరి – నారా కుటుంబాల సంక్రాంతి సంద‌డి..

టిడిపి అధినేత నారా చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా సంక్రాంతి రోజుల్లో నారా, నందమూరి కుటుంబసభ్యులు ఇక్కడికి చేరుకొని పండుగ చేసుకోవడం ఆనవాయితీ. శనివారమే వారంతా గ్రామానికి చేరుకొని ఇవాళ వేడుకల్లో పాల్గొన్నారు.

నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, వారి చిన్న కుమార్తె తేజస్విని, నారా లోకేశ్‌ తనయుడు దేవాన్ష్‌, కంఠమనేని శ్రీనివాస్‌, లోకేశ్వరి తదితరులు భోగి సంబరాల్లో పాల్గొని సందడిగా గడిపారు. వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను నందమూరి రామకృష్ణ, స్థానిక టిడిపి నేతలు భోగి మంటల్లో వేశారు. గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను వసుంధర, తేజస్విని పరిశీలించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement