Saturday, May 11, 2024

Flash: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్ మంజూరు. హై కోర్టులో బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడినప్పటికీ లోకల్ కోర్టు మాత్రం ఆయనకు లభించింది. 14 రోజులు రిమాండ్ విధించి అనంతరం ఏసీఎంఎం న్యాయ స్థానం బెయిల్ ఇచ్చింది. ఇద్దరు పూచీకత్తులు 40 వేల రూపాయల డిపాజిట్ తో బెయిల్ మంజూరు చేసింది.

కాగా, గురువారం(ఫిబ్రవరి 10) అర్ధరాత్రి ఎమ్మెల్సీ అశోక్ బాబును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగంలో ఉన్న సమయంలో ఆయన నకిలీ బీకాం సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్లు పొందారని ఆరోపణతో సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఆయనను అదుపులోకి తీసుకున్నారు కానీ కోర్టులో ప్రవేశ పెట్ట లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ వేసి బెయిల్ అడిగారు. కానీ బెయిల్ ఇవ్వవద్దని ప్రాథమిక ఆధారాలను సమర్పించడానికి గడువు కావాలని సీఐడీ తరపు లాయర్లు హైకోర్టును కోరారు. దీంతో సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement