Wednesday, May 8, 2024

వ్యవసాయ బడ్జెట్‌ రూ.31,256 కోట్లు

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021-22 వార్షిక బడ్జెట్‌‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఏపీ అసెంబ్లీలో మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ బడ్జెట్ ను కేటాయించినట్టు ఆయన చెప్పారు. 1,778 రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన యంత్రాల కొనుగోలుకు 40 శాతం రాయితీ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి గానూ.. వివిధ పథకాల కోసం రూ.31,256.36 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం 10,544 గ్రామీణ, 234 పట్టణ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులలో మార్కెట్‌ జోక్యం కోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2021-22 ఏడాదికి గానూ ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసమై రూ. 500 కోట్లు కేటాయించింది.

వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు..

  • వైఎస్సార్‌ రైతు భరోసా- రూ. 7,400 కోట్లు
  • వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా – రూ. 1802.82 కోట్లు
  • వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు – రూ. 500 కోట్లు
  • ఉపాధి హామీ పథకం కోసం రూ.8,116.16 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ జలకళ పథకం కోసం రూ.200 కోట్లు
  • వ్యవసాయ పథకాల కోసం రూ.11,210.80 కోట్లు
  • వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస యోజన రూ.583.44 కోట్లు
  • ధరల స్థిరీకరణ ఫండ్‌ రూ.500 కోట్లు

ఇదీ చదవండి: ఏపీ బడ్జెట్ హైలైట్స్..ఎవరెవరికి ఎంతెంత?

Advertisement

తాజా వార్తలు

Advertisement