Friday, April 26, 2024

నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావా? : పవన్ కు కొడాలి నాని సవాల్

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మంత్రులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్‌ కల్యాణ్‌కు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్ జీవితంలో సీఎం జగన్‌ను ఓడించలేరని కొడాలి నాని అన్నారు. జగన్‌ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకోవాలని హితవు పలికారు. ‘’2024 లో నువ్వు ఏం చేస్తావో చూస్తా. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి రా చూసుకుందాం. పవన్ ఏంటి మమ్మల్ని భయపెట్టేది. ఇంకో జానీ సినిమా చూపించి భయపెడతాడా. పవన్‌ను చూసి ఆయన అభిమానులు భయపడతారు. జగన్మోహన్‌రెడ్డి ఆ నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే భయపడలేదు. నీవెంటి ఆయనను భయపెట్టేది. పవన్ ప్రసంగాలకు జనం భయపడతారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టులు చదివి మమ్మల్ని భయపెడతాడా. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్‌కల్యాణ్’’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: రాజకీయాల్లో కలుపు మొక్కలు తీసేస్తా: పవన్ కళ్యాణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement