Sunday, October 17, 2021

ఉత్తేజ్ భార్య సంస్మరణ సభకు హాజరైన చిరంజీవి

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మ ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆమె సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఉత్తేజ్ కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి, శ్రీకాంత్, రాజశేఖర్, సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు వంటి టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తేజ్ భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కాగా చిరంజీవిని చూసి ఉత్తేజ్ మరోసారి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. చిరంజీవిని హత్తుకుని భోరున విలపించారు. దాంతో చిరంజీవి.. ఉత్తేజ్‌ను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News