Wednesday, May 15, 2024

ఎపిలో మెడిక‌ల్ మాపియా … న‌కిలీ మందుల‌తో ప్రాణాలు హ‌రి..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మందుల మాఫియా రెచ్చిపో తోంది. దీనికి నిదర్శనమే పశ్చిమ గోదావరి జిల్లాలో దొరికిన లక్షలాది రూపాయల నిషేధిత మందులు.. మందులపై వున్న వాస్తవ ఎం.అర్‌.పీ. చెరిపి వేసి అధిక ధరలు ముద్రించడం… జనరిక్‌ షాపుల పేరుతో నాన్‌ ప్రమోటేడ్‌ మందుల విక్రయాలు… రోగుల అవసరం.. అవగాహనా లోపాల్ని అదునుగా తీసుకుంటు-న్న మందుల షాపుల యజమానులు.. వెరశి ఔషధ నియత్రణశాఖ మామూళ్ల మత్తులో జోగుతుండడమే ఈ అక్రమాలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా వెయ్యి కోట్లకు పైగా ఈ అక్రమ దందా నడుస్తున్నట్లు- సమాచారం. మందుల మాఫియాపై ఆంధ్రప్రభ పరిశోధనాత్మకంగా జరిపిన అధ్యయనంలో మందుల కంపెనీలు.. ప్రవేటు- డాక్టర్లు.. షాపుల యాజమానుల దోపిడీపై ఎన్నో విషయాలు వెల్లడయయాయి.

మందుల మాయాజాలంతో నిలువు దోపిడి
పే-టె-ంట్‌ మందులు బ్రాండెడ్‌ మందులు జనరిక్‌, నాన్‌ ప్రమోటింగ్‌ బ్రాండెడ్‌, పిసిడి కంపెనీ మందుల పేరుతో రోగులను నిలువు దోపిడి చేస్తున్నాయి. కొన్ని ఫార్మా కంపెనీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక రకాల పరిశోధనలు చేసి కొత్త మందును కనుగొని.. హక్కులు పొందిన మందులపై గరిష్ట ధరను నిర్ణయించి ఒక బ్రాండ్‌ పేరుతో మార్కెట్లో విక్రయిస్తారు. ఇలా పే-టె-ంట్‌ హక్కుల యొక్క కాలవ్యవధి పూర్తి అయిన తర్వాత ఇతర ఫార్మా కంపెనీలు ఇవే మందులపై ప్రభుత్వాల నుండి తయారీ హక్కులు పొంది, తయారుచేసి తాము సొంతంగా బ్రాండ్‌ పేరుతో వ్యాపార హక్కులు పొంది ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మార్కెట్లో విక్రయిస్తారు. ఇలాంటి మందులను బ్రాండెడ్‌ మందులు లేదా నాన్‌ పే-టె-ం-టె-డ్‌ బ్రాండెడ్‌ మందులు అంటారు. వీటిలో మళ్లీ రెండు రకాలు ఉన్నాయి, ప్రమోటింగ్‌ బ్రాండెడ్‌ మందులు మరియు నాన్‌ ప్రమోటింగ్‌ బ్రాండెడ్‌ మందులు. కొన్ని ఫార్మా కంపెనీలు మందులకు ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేష్రన్‌ పొంది ఒక బ్రాండ్‌ పేరును నిర్ణయించి మెడికో మార్కెటింగ్‌ విధానము ద్వారా మార్కెట్లో మందులను విక్రయిస్తారు. హోల్‌ సేల్‌ డిస్ట్రిబ్య్రూటర్‌ లకు 10 నుండి 15 శాతం లాభశాతం , మందుల షాపులకు 15 నుండి 20 లాభ శాతం కల్పించి మార్కెట్‌ లో ప్రజలకు విక్రయిస్తారు. వీటినే ప్రమోటింగ్‌ బ్రాండెడ్‌ మందులు అని పరిగణిస్తారు. అలాగే కొన్ని ఫార్మా కంపెనీలు మెడికో మార్కెటింగ్‌ విధానం లోని మార్కెటింగ్‌ ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటూ మందులను ఏజెన్సీలకు లేదా డిస్ట్రిబ్య్రూటర్లకు మరియు మందుల షాపులకు కూడా నేరుగా సరఫరా చేసి దాదాపు 80 కి పైగా శాతం రాయితీలతో సరఫరా చేస్తారు. అంటే ఉదాహరణకి 100 రూపాయలు ఎంఆర్పి గల మందును 20 రూపాయలకే మందుల షాపులకు సరఫరా చేస్తారు. ఈ మందులను ప్రజలకు మందుల షాపుల వారు ఎమ్మార్పీ ధరలకే అమ్ముతారు, వీటి అమ్మకాల పై నాలుగింతల ఆదాయం రి-టైల్‌ మందుల షాపుల వారికి దక్కుతుంది. ఇటు-వంటి మందులను నాన్‌ ప్రమోటింగ్‌ బ్రాండెడ్‌ మందులు అంటారు. అలాగే పీసీడీలను గమనిస్తే కొన్ని కంపెనీలు ఔషధ నియంత్రణ శాఖ నుంచి హోల్‌ సేల్‌ మందుల విక్రయ లైసెన్సులను పొంది హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ లలో కుటీ-ర పరిశ్రమల్లాగా వెలసి ఉన్న మందుల తయారీ కంపెనీల వద్ద తాము కోరుకున్న బ్రాండ్‌ పేర్లతో స్పెషాలిటీ- వారీగా అనేక రకాల మందులను తయారు చేయించుకుని మార్కెట్లో అత్యధిక రాయితీలు కల్పించి నేరుగా మెడికల్‌ షాపులకు, ప్రవేటు- ఆసుపత్రులకు మాత్రమే విక్రయిస్తారు.

జనరిక్‌ పేరుతో జనాలకు టోపీ
జనరిక్‌ మందులు అంటే కొన్ని ఫార్మా కంపెనీలు తాము తయారు చేసే మందులకు ఏటు-వంటి బ్రాండ్‌ పేరును పెట్టకుండా ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేష్రన్‌ ఖర్చును కూడా తగ్గించుకుంటూ కేవలం వారు తయారు చేసే మందులపై లేబుల్‌ మీద ఔషధం పేరు మాత్రమే ముద్రించి మార్కెట్‌ లోకి సరఫరా చేస్తారు. ఔషధం యొక్క మాలిక్యూల్‌ పేరే జనరిక్‌ పేరుగా పరిగణిస్తారు. ఇలాంటి మందులు చాలా చవకగా లభిస్తాయి. వీటిని మనం ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే చూడగలం. ప్రైవేటు- మందుల షాపుల్లో ఇలాంటి జనరిక్‌ మందులను బూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు మందుల పై పెట్టే ఖర్చులను తగ్గించడానికి వివిధ పథకాల ద్వారా జనరిక్‌ మందుల షాపులను అందుబాటు-లోకి తీసుకొచ్చినా నిజమైన జనరిక్‌ మందులు ప్రజలకూ ఎక్కడా అందడం లేదు. కారణం వీటిని విక్రయిస్తే మందుల షాపుల వారికి ఎమ్మార్పీ మీద కేవలం 10 శాతం మాత్రం ఆదాయం వుంటు-ంది. అందువల్ల జనరిక్‌ మందుల షాపులు నాన్‌ ప్రమోటింగ్‌ బ్రాండెడ్‌ మందులను విక్రయిస్తూ ఎమ్మార్పీ ధరలపై 80శాతం వరకూ రాయితీలు అంటూ సగటు- 40 నుండి 50 శాతం రాయితీలకు మాత్రమే ప్రజలకు విక్రయిస్తూ తాము మాత్రం రెండింతల ఆదాయం పొందుతూ వున్నారు. ఇతర మందుల షాపులు మాత్రం వీటినే ప్రజలకు ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తూ నాలుగింతల ఆదాయం పొందుతూ సామాన్య ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు. వాస్తవానికి జనరిక్‌ మందుల షాపులలో అమ్మేవి నాన్‌ ప్రమోటింగ్‌ బ్రాండెడ్‌ మందులు.

అటకెక్కిన నిబంధనలు
మందుల విక్రయాలపై నిబంధనలు వున్నా అమలు జరగడం లేదనే చెప్పొచ్చు. వైద్యులు మందుల యొక్క జనరిక్‌ పేరునే అంటే మాలిక్యుల్‌ పెరులనే ప్రిస్కిప్ష్రన్‌ లలో రాయాలని మెడికల్‌ కౌన్సిల్‌ పదేపదే చెబుతున్నప్పటికీ, బ్రాండెడ్‌ మందులు రాసినా, అర్థం కాని విధంగా రాసినా మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేష్రన్‌ లు రద్దు చేస్తామని హెచ్చించినా కూడా వైద్యులు బ్రాండెడ్‌ మందులే రాస్తూ ఉంటారు. కారణం మందుల కంపెనీల నుంచి అనేక రకాల ప్రోత్సాహకాలు అందుతాయి. మందుల షాపుల వారు ఒక మందుకు బదులుగా మరొక మందును వినియోగదారుడికి విక్రయిస్తే భారతీయ శిక్షాస్మృతి 276 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి, 6 నెలల వరకూ జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల వరకు జరిమానా గాని లేదా రెండు విధించొచ్చు అనే నిబంధన ఐపిసి లో శాసనం ఉందని చాలామందికి తెలియదు.

ఔషధ నియత్రణ శాఖ మామూళ్ల మత్తు
ఔషధ నియంత్రణ శాఖ జనరిక్‌ మందుల షాపుల ఏర్పాట్లు- ప్రోత్సహించకుండా, మందుల షాపుల యజమానుల వ్యాపారాలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జనరిక్‌ మందుల షాపులపై డిస్కౌంట్‌ లో వేయొద్దంటూ బెదిరింపులకు గురి చేస్తూ, జనరిక్‌ మందుల షాపుల ఏర్పాట్లను అణచివేస్తున్నారు. ప్రజలకు సరఫరా చేస్తున్న మందుల యొక్క రేట్లను ప్రతి రెండు మూడేళ్లకోసారి పున:శ్చరణ చేస్తూ డ్రగ్‌ ప్రైస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ అనే చట్ట ప్రకారం ప్రజలకు అందుబాటు-లో మందుల రేట్లను నిర్ణయించి సరఫరా చేయాల్సి ఉండగా. నిబంధనలను తుంగలో తొక్కి చూసి చూడనట్లు-గా మందుల మాఫియా ను రెచ్చిపోయేలా ఊతమందిస్తున్నారనే విమర్శలు వున్నాయి. రాష్ట రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల రీ-టైల్‌ మందుల షాపులు.. మరో 15 వేలకు పైగా హోల్‌ సేల్‌ షాపులు, వందలాది ఫార్మా కంపెనీల నుంచి వ్యవస్థీకృతంగా 100 కోట్లకు పైగా మామూళ్లు దండుకుంటు-న్నట్లు- ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మందుల మాఫియా రెచ్చిపోతోందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికయినా మామూళ్ల మత్తు నుంచి ఔషధ నియంత్రణ శాఖ తేరుకుని రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ.. అక్నిరమాలను అరికట్టి.. ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.

సీఎం జగన్‌ దృష్టి సారించాలి
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో జరుగుతున్న మందుల మాఫియాపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సివుంది. ఔషధ నియత్రణ శాఖను అప్రమత్తం చేసిమెడికల్‌ మాఫియా ఆగడాలు అరికట్టి.. రోగులకు నాణ్యమైన మందులు తక్కువ ధరలో అందుబాటు- లోకి తేవడంతో పాటు- ప్రజారోగ్యాన్ని కాపాడాలని సర్వత్రా కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement