Thursday, April 25, 2024

ప్రాణ నష్టం జరగకుండా చర్యలు.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలే..

ఒంగోలు, ప్రభన్యూస్‌: వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో పలు ప్రాంతాల్లో జల ప్రళయం ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం ఉదయం పుదుచ్చేరి చెన్నై మధ్య తీరం దాటింది. ఈ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంతంలో ఈదురు గాలులు విపరీతంగా వీస్తుండటంతో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉంది, ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు. అధికారులంతా మండల కేంద్రాల్లో ఉండి.. తుఫాన్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, గృహనిర్మాణ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాల పై ప్రాథమిక ఆంచనాలు తయారు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబల కుండా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. పారిశుద్ద్య లోపంతోనే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement