Friday, May 3, 2024

Train Canceled: నేటి నుంచి పలు రైళ్లు రద్దు

హైదరాబాద్ మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా పలు రైలు సర్వీసులు రద్దు చేయడంతో పాటు మరి కొన్ని సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. దీంతో ఈనెల 5నుంచి 11వ తేదీ వరకు పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి.

ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నత అధికారులు నుంచి ఉత్తర్వులు శుక్రవారం అందినట్లు వెల్లడించారు. ఈ మేరకు కావున ప్రయాణికులు గమనించి ప్రయాణం చేయాలని సూచించారు. ఇవాళ్టి నుంచి 11వ‌ర‌కు శాతవాహన సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌,ఇంట‌ర్‌సిటీ సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ గుంటూరు – కాజిపేట, కాజిపేట – గుంటూరు మధ్య నడుస్తుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement