Thursday, May 2, 2024

AP: శ్రీకాళ‌హ‌స్తీలో ర‌ష్య‌న్ల రాహుకేతు పూజ‌లు ..

శ్రీకాళహస్తీశ్వర స్వామిని రష్యా దేశానికి చెందిన భక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో రష్యన్ భక్తులు పవిత్రమైన రాహుకేతు పూజలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని శిలా నైపుణ్యాలను పరిశీలించారు. ఆలయం శిల్పకళ అబ్బుర పరిచిందని.. ఫోటోలు, సెల్ఫీలు దిగారు.

ఆలయంలో సందడి చేసిన రష్యన్స్​తో భక్తులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. వేద జ్యోతిషశాస్త్రంలో దుష్ప్రభావాల నుండి ఉపశమనం పొందేందుకు రాహుకేతు పూజ చేస్తారు. భారతీయ సంప్రదాయాల్లో ఈ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొన్న రష్యన్ భక్తులు రాహుకేతు పూజలు నిర్వహించారు. ప్రస్తుతం రష్యన్‌ భక్తుల పూజలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement