Thursday, May 2, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం..

అమరావతి, ఆంధ్రప్రభ: ఈక్వటోరియల్‌ హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 15వ తేదీ సాయంత్రం అల్పపీడనం ఏర్పడింది. ఇది బుధవారం ఉదయం 8.30 గంటలకు దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ఉంది. తూర్పు-ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని చుట్టూ ఉన్న దక్షిణ అండమాన్‌ సముద్రం మీదుగా కదులుతూ 19వ తేదీ ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది మొదట్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, 20వ తేదీ ఉదయానికి వాయుగుండముగా మారి 21వ తేదీ నాటికి తుఫానుగా మారుతోందని హెచ్చరించారు.

22 వరకు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోందన్నారు. ఆ తర్వాత, ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి, మార్చి 23 ఉదయం నాటికి బంగ్లాదేశ్‌ మరియు ఆనుకుని ఉన్న ఉత్తర మయన్మార్‌ తీరానికి చేరుకుంటు-ందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా గురు, శుక్రవారాల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, యానం ప్రాంతాల్లో వాతావరణ పొడిగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement