Saturday, April 27, 2024

మళ్ళీ అల్పపీడనం.. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్ష సూచన..!

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్ర ప్రదేశ్‌ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వాయువ్య మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మీద దాదాపు ఈనెల 18 వ తేదీ న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతం లో రానున్న 48 గంటలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

దీని ఫలితంగా రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఈనెల మొదటి వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. గోదావరికి వరద పోటెత్తింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement