Friday, April 26, 2024

వాగులో పడిన లారీ

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఓ లారీ అదుపు తప్పి వాగులోకి పడింది. జిల్లెడువాగులో ఈ ఘటన చోటుచేసుకుంది. కదిరి ప్రాంతంలో భారీ వర్షం నమోదు కావటంతో గొల్లపల్లి వద్ద నిన్న కారు వాగులో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పులివెందుల-కదిరి మధ్య వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దొరిగిల్లు మీదుగా పులివెందులకు వాహనాలు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లెడువాగు దాటుతూ ఓ లారీ అదుపు తప్పి కిందకు పడిపోయింది. అయితే, డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement