Friday, April 26, 2024

జగన్ సర్కార్ కి 13 రోజులే టైంః నారా లోకేశ్ డెడ్ లైన్

గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో న్యాయం చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దిశ చట్టం ప్రకారం ఇప్పటికే 21 రోజుల డెడ్ లైన్ విధించిన లోకేశ్… ఇంకా 13 రోజులే మిగిలున్నాయని గుర్తు చేశారు.

“7 రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో కోర్టు విచారణ, 21 రోజుల్లో ఏకంగా ఉరిశిక్ష విధించేలా దిశ చట్టం రూపొందించామంటూ జగన్ పాలాభిషేకాలు చేయించుకున్నారు. కానీ ఆ చట్టం ఇంతవరకు కార్యరూపమే దాల్చలేదని కేంద్రం తేల్చిచెప్పింది. దాంతో ఇది కూడా ఫేక్ సీఎం ఇస్తున్న ఫేక్ జీవోల మాదిరే ఫేక్ చట్టం అని అందరికీ తెలిసిపోయింది. అయినప్పటికీ ఇంకా దిశ చట్టం అంటూ మాయ చేయాలని చూస్తున్నారు. దిశ చట్టం తెచ్చామని సొంత మీడియాలో రూ.30 కోట్లతో ప్రచారం చేసుకున్న తర్వాత వందల మంది ఆడబిడ్డలు బలయ్యారు. ఇక 13 రోజులే మిగిలున్నాయి. రమ్యను బలితీసుకున్న ఉన్మాదిని ఎప్పుడు ఉరితీయబోతున్నారు?” అంటూ లోకేశ్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement