Sunday, May 19, 2024

ఆడుకుంటూనే అనంత లోకానికి : ఇసుకలో కూరుకుపోయిన నాలుగేళ్ల చిన్నారి

పెద్దకడబూరు : ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన ఇసుకలో ఆడుకుంటూ నాలుగేళ్ల చిన్నారి అనంత లోకాలకు వెళ్లిన‌ ఉదంతం పెద్దకడబూరు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కల్లుకుంట గ్రామానికి చెందిన కురువ నరసన్న పద్మ దంపతుల కుమార్తె భారతి (4) ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన ఇసుకలో ఆడుకుంటూ ఇసుకలో కూరుకుపోయింది. కొద్ది సేపటికి కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి చుట్టుపక్కల వెతికినా ఆచూకి తెలియలేదు. సమీపంలో ఉన్న ఇసుకలో కూరుకుపోయిన చిన్నారి చేయి మాత్రం కనిపించడంతో హుటాహుటిన తల్లిదండ్రులు బయటకు తీశారు. స్థానిక వైద్యులు దగ్గర తీసుకెళ్లగా అప్పటి కే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. కళ్ల ముందే ఆడుకునే కూతురును ఇసుక రూపంలో మృత్యువు కబళించిన సంఘటనతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement