Saturday, April 27, 2024

పగిడిరాయి లో ఉద్రిక్తత .. పోలీసుల పై గ్రామస్తులు దాడికి యత్నం


తుగ్గలి -తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో బీసీ లోని ఓ వర్గం దళితుల్లోని ఓ వర్గం మధ్య గత వారం క్రితం అమ్మాయి విషయం పై విభేదాలు రావడంతో సోమవారం రాత్రి పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పగిడిరాయి గ్రామంలో దళితుల్లోని ఓ వర్గంకు చెందిన ఓ యువకుడు పెళ్లై మూడు రోజులైనా వివాహితను తన వెంట తీసుకెళ్లాడు. దీంతో బిసీ వర్గంకు చెందిన కొందరు దళితుల్లోని ఓ వర్గంపై దాడి చేసి వారి ఇల్లు ను ధ్వంసం చేయడం గత వారం క్రితం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పత్తికొండ సిఐ నారాయణ రెడ్డి, జొన్నగిరి ఎస్ ఐ సురేష్, పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పగిడిరాయి నుంచి వెళ్లిపోయిన అబ్బాయి, అమ్మాయిల ను విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్నా బీసీ లోని ఓ వర్గం సాయంత్రం జొన్నగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది. దీంతో ఎస్ ఐ సురేషు అమ్మాయి తరపున వచ్చిన వారిపై దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో కొంతమంది బీసీ వర్గంలోని కొందరు పగిడిరాయి కి వెళ్లి మరల దళితుల్లోని సమాజ వర్గం ఇల్లు ను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ ఐ సురేష్ పోలీస్ సిబ్బంది హుటాహుటిన పగిడిరాయి కి వెళ్లారు. ఆ సమయంలో కొందరు గ్రామస్తులు ఎస్సై సురేష్ పై కారం పొడి చెల్లి దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది ఈ విషయం తెలుసుకున్న పత్తికొండ రూరల్ సిఐ నారాయణ రెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం లో సి ఐ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మా పోలీసులు మీ పట్ల దురుసుగా మాట్లాడి ఉంటే తాను క్షమాపణ చెబుతున్నానని అందువల్ల అందరూ శాంతియుతంగా ఉండాలని గ్రామస్తులకు నచ్చచెప్పడం జరిగింది. .

Advertisement

తాజా వార్తలు

Advertisement