Friday, May 3, 2024

Kurnool: గణనీయంగా తగ్గిన నేరాలు… కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్..

కర్నూలు బ్యూరో, ప్ర‌భ‌న్యూస్ః కర్నూల్ జిల్లాలో పోలీస్ శాఖ సమర్ధ వంతంగా పని చేయడం వల్లే 2023 లో నేరాలు గణనీయంగా తగ్గాయని జిల్లా ఎస్పి జి. కృష్ణకాంత్ వెల్లడించారు. శుక్రవారం కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో 2023 క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీసింగులో విన్నూత్న మైన మార్పులను తీసుకురావడం వల్లనే ఇది సాధ్యమైంద న్నారు. మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో 2024 లో మరింత మెరుగైన పోలీసింగ్ తో ప్రజలకు ఉత్తమమైన సేవలను అందిస్తామని పేర్కొన్నారు.గత సంవత్సరం తో పోల్చుకుంటే 2023 లో అన్ని రకాలైన నేరాల నియంత్రణలో గణనీయమైన మార్పు కనిపించిందన్నారు. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ఎక్కువ స్థాయి లో నేరాలను నియంత్రించడంలో పోలీసులు సఫలీకృతం అయినట్లు పేర్కొన్నారు.
నేర గణాంకాలు ఇలా :
గణనీయంగా నేరాల తరుగుదల విజబుల్ పోలీసింగ్, అసాంఘిక శక్తుల పైన నిఘా, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, మహిళా పోలీసు సేవల సమర్థవంత నిర్వహణ, పీడి యాక్ట్ ప్రయోగం, నాటు సారా పై ఉక్కుపాదం మోపడం, కన్విక్షన్స్ పైన ఫోకస్ చేయడం, గంజాయి పైన కట్టడి వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పి తెలియజేసారు. 2022 లో నమోదైన కేసులు 6985 నమోదు కాగా, 2023 లో 5829 కేసులు నమోదైనట్లు
వారు తెలియ జేశారు.
హత్యలు, హత్యాయత్నం,:
హత్యలు, హత్యయత్నాలు, ఘర్షణ కేసులకు సంబంధించి :- 2022 లో 39 హత్య కేసులు, 2023 లో 33 హత్య కేసులు నమోదు కాగా 2022 లో 86 హత్యయత్నం కేసులు, 2023 లో 45 వాత్యాయత్నం కేసులు నమోదైనట్లు తెలిపారు. అదే విధంగా 2022 లో 28 దొమ్మి కేసులు, 2023 లో 12 దొమ్మీ కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం తో పోల్చుకుంటే కేసులు కొంత మెరకు తగ్గుముఖం పట్టాయి అన్నారు
ఆస్తికి సంభందించిన నేరాలు:-
బీట్స్ ను రీ- ఆర్గనైజ్ చేయడం, నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ వినియోగం,నిందితుల పైన దర్యాప్తు. జైలు నుండి విడుదల అయిన నేరస్తులపై నిఘా, పొరుగు జిల్లాలు మరియు రాష్ట్రాలతో సమన్వయంతో, అనుమానితుల వెళ్లి ముద్రల వోల్చడం ద్వారా దొంగతనాలు తగ్గడం జరిగింది. 2023 లో నేరస్తులను గుర్తించడంతో పాటు రికవరీ శాతం కూడా బాగా పెరిగిందన్నారు.
దోపిడీలు:-
దోపిడీలకు సంబంధించి 2022 లో 5 కేసులు, 2023 లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. గత సంవత్సరం తో పోల్చుకుంటే పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.
బందిపోటు :-
2022 లో 14 కేసులు, 2023 లో 2 కేసులు నమోదు అయినవి. గత సంవత్సరం తో పోల్చుకుంటే పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు ఎస్పీ తెలిపారు.
దొంగతనాలు:-
2022 లో 303 కేసులు నమోదు కాగా, 2023 లో 224 కేసులు నమోదు అయినాయి. గత సంవత్సరం తో పోల్చుకుంటే 26% తగ్గుముఖం పట్టాయన్నారు.
పగటి దొంగతనాలు:-
2022 లో 49 కేసులు నమోదు కాగా, 2023 లో 26 కేసులు నమోదు అయినాయి. గత సంవత్సరం తో పోల్చుకుంటే 47% తగ్గుముఖం పట్టాయని తెలిపారు.
రాత్రి దొంగతనాలు:-
2022 లో 130 కేసులు నమోదు కాగా, 2023 లో 112 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు:
2022 లో 601 రోడ్డు ప్రమాదాలు, 2023 లో 456 ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ ల ఐడెంటిఫికేషన్, రెక్టిఫికేషన్, ప్రమాద సమయాలను గుర్తించి ఆ సమయాల్లో పోలీసు నిఘా, ఎన్ఫోర్స్మెంట్ పెంచడం, ఏ రోడ్లలో ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తించి తగు చర్యలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు శాతం గణనీయంగా తగ్గడం జరిగిందన్నారు.
మహిళలపై తీవ్ర నేరాలు:
విజబుల్ పోలీసింగ్, దిశ కార్యక్రమాల పటిష్ట అమలు, నేర ప్రభావిత ప్రదేశాల జియోమ్యాపింగ్, మహిళా పోలీసుల పర్యవేక్షణ తదితర చర్యల ద్వారా మహిళపై జరిగే తీవ్ర నేరాలు తగ్గుముఖం పట్టగా. కుటుంబ హింస కు సంభందించిన నేరాలను సైతం నియంత్రించడం జరిగింది. 2022 లో 6 వరకట్న మరణాల కేసులు, 2023 లో 1 వరకట్న మరణాల కేసు నమోదు అయినది. గత సంవత్సరం తో పోల్చుకుంటే 83% తగ్గుముఖం పట్టాయి. 2022 లో 28 అత్యాధార కేసులు 2023 లో 28 కేసులు నమోదు అయినవి. ఇవి స్థిరంగా వున్నవి. 2022 లో 19 POCSO Grave కేసులు, 2023 లో 17 POCSO Grave కేసులు నమోదు అయినవి. గత సంవత్సరం తో పోల్చుకుంటే 11% తగ్గుముఖం పట్టాయి, మరియు 2022 లో 25 POCSO Non Grive కేసులు, 2023 లో 19 POCSO Non Grave కేసులు నమోదు అయినవి. గత సంవత్సరం తో పోల్చుకుంటే 24% తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు.
SC/ST లపై నేరాలు:
గ్రామ సందర్శనలు, నేర ప్రభావిత ప్రదేశాలను గుర్తించి నిఘా ఉంచడం, జిల్లా రివ్యూ మీటింగులు, నేరస్తుల పట్ల కరనమైన చర్యలు చేపట్టడం ద్వారా SC/ST లపై జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2022 లో 151 కేసులు, 2023 లో 150 SC/ST కేసులు నమోదు. గత సంవత్సరం తో పోల్చుకుంటే 1% తగ్గుముఖం.
సైబర్ నేరాలు :-
2022 లో 56 కేసులు, 2023 లో 39 కేసులు నమోదు అయినాయి. గత సంవత్సరం తో పోల్చుకుంటే 30% తగ్గుదల కనబడిందన్నారు.
లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం:
జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 2023 లో నాలుగు విడతలు గా జరిగిన లోక్ అదాలత్ లో పోలీస్ శాఖకు సంభందించి మొత్తం 3935 కేసులను పరిష్కరించడం జరిగింది. అందులో 2550 కంపౌండబుల్ IPC కేసులు (భూమి, ఆస్తి, హక్కులపై వివాదాలు,చిన్న నష్టాలు, గాయాలు, చిన్న దొంగతనాలు, దోపిడీలు, సాధారణ స్థాయిలో హింస) వంటి కేసులు కాగా ఎస్ఎల్ఎల్ & ఎక్సైజ్ కేసులు 251, ఐపిసి కానీ ఇతరోకేసులు మరియు పెట్టి కేసులు 1134 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు తెలిపారు.
మొబైల్ రీకవరీ మేళా. ;
బాధితులు పొగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి మొబైల్ రికవరీ మేళాలో అందజేశారు. బాధితులలో ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 6719 మొబైల్స్ రికవరీ చేశాం. (వాటి విలువ 14.61 crores ( 5 http://Kurroolpolice.in/mobiletheft ໐ 3 1 33 @ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తామన్నారు.
సిసి కెమెరాలు.:
గ్రామాలు, పట్టణాలలో నేర నివారణకు సమస్యాత్మక, ఫ్యాక్షన్ ప్రభావితమైన 112 ప్రదేశాలను గుర్తించి 428 సిసి కెమెరాలను ఏర్పాటు చేశాం.
ఎన్ డి పి ఎస్ కేసెస్ :
2022 లో 11 కేసులు, 2023లో 13 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.అదేవిదంగా మట్కా, క్రికెట్ బెట్టింగ్, గాంబ్లింగ్ లలో 592 కేసులలో 1833 మందిని అరెస్ట్ చేయడం జరిగినది
Rs. 1,51,97,000 సీజ్ చేసినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement