Tuesday, April 30, 2024

కర్నూలు జిల్లా టిడిపి నేత‌ల గృహ నిర్భంధం …

క‌ర్నూలు – టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ కు నిరసనగా టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలైన కర్నూలు, నంద్యాల లోని షాపింగ్ మాల్స్, దుకాణాలను మూసివేశారు. పలు ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. టీడీపీ నేతలు బస్ డిపోలు, బస్టాండ్ల ఎదుట నిరసనకు దిగారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

కర్నూలులో ఎమ్మెల్సీ బీటీ నాయుడు అరెస్ట్
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం కట్టబెట్టాలని బీటీ నాయుడు కోరారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్షతోనే జరిగిందన్నారు.

కర్నూలులో కోట్ల గృహ నిర్బంధం

టీడీపీ బంద్ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ ముఖ్య నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కర్నూలులో కేంద్రం మాజీ మంత్రి కోట్ల భాస్కర్ రెడ్డిని సైతం పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా పోలీసులు కర్నూలు జిల్లా వ్యాప్తంగా గస్తీ కాస్తున్నారు. ఇక టిడిపి రాష్ట్ర నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లును కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement