Saturday, October 12, 2024

హైవే టోల్ ప్లాజా చార్జీలు రద్దు చేయాలి

NHAI పెంచిన టోల్ ప్లాజా చార్జీలు రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించి రవాణా రంగాన్ని ఆదుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం (ppss), లాగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తో కలిసి కర్నూలు హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.ppss నగర నాయకులు Mనాగరాజు అధ్యక్షతన జరిగిన ఆందోళననుద్దేశించి PPSS రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరిగినేని పుల్లారెడ్డి, లాంగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు P.మినల్లా మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు ప్రతి ఏటా టోల్ ప్లాజా చార్జీలు పెంచి రవాణా రంగంపై పగ పట్టినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ, ప్రైవేటు రవాణా రంగాంలపై కోలుకోలేని విధంగా భారాలు వేస్తూ రవాణా రంగాన్ని దివాలా తీస్తున్న కేంద్ర ప్రభుత్వంపై జగన్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ రంగాన్ని కాపాడాలని కోరారు. ఈ ఆందోళనలో లారీ యజమానులు సంఘం ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా, లారీ ఓనర్స్ వైపి సీను, పల్సర్ భాష, మధు, చాందు, ppss నగర నాయకులు P.ఇక్బాల్, శ్రీనివాసరెడ్డి రమణ గౌడ్, శీను, సివివర్మ, మద్దిలేటి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement