Sunday, April 28, 2024

ఫ్రైడే ఫీలింగ్.. వీడియోని పోస్ట్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా

సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా..ఆయ‌న ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. టీ20 మ్యాచ్ లో బౌండరీ లైన్ చివరిలో బంతిని ఆపేందుకు మహిళా క్రికెటర్ చేసిన ప్రయత్నం అందులో కనిపించింది. బంతి వెంట బౌండరీ దాకా పరిగెత్తిన ఆమె.. ఫోర్ వెళ్లకుండా ఆపేందుకు చేసిన విన్యాసం నిజంగా అద్భుతంగా ఉంది. అదే మహీంద్రాని అబ్బురపరిచింది. ఈ వీడియోను ట్వీట్ చేసిన ఆయన.. మీరు ఆడేందుకు వెళ్తుంటే.. మీ దగ్గర ఉన్న ఎఫర్ట్ అంతా పెట్టండి. సగం చర్యలు సరిపోవు అని క్యాప్షన్ ఇచ్చారు. నిబద్ధతతో, పూర్తి ఎఫర్ట్ తో ప్రయత్నించాలని పరోక్షంగా ఆయన మెసేజ్ ఇచ్చారు. ‘ఫ్రైడే ఫీలింగ్’ అనే హాష్ ట్యాగ్ ను జత చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మహీంద్రా మెచ్చిన ఆ స్ఫూర్తిదాయక వీడియోను మీరూ చూసేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement