Thursday, May 9, 2024

తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులివ్వండి : జ‌గ‌న్ ను కోరిన‌ మేయర్

కర్నూలు నగరంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నిధులివ్వాలని కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జగనన్న వసతి దీవెన పథకం రెండవ విడత ప్రారంభించేందుకు ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ మీదుగా నంద్యాల వెళ్తుండ‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో మేయర్ బి.వై.రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కర్నూలు నగర దాహార్తిని తీర్చేందుకు నగర పాలక సంస్థ రూపొందించిన మూడు ప్రణాళికలు 1. మునగాలపాడు ఎస్.ఎస్.ట్యాంక్ దగ్గర రూ.934 కోట్లతో 2,698 ఎకరాల్లో మరో ఎస్.ఎస్.ట్యాంకు నిర్మాణం. 2. ముచ్చుమర్రి సమీపంలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ వద్ద రూ.1461 కోట్లతో 3,150 ఎకరాల్లో నూతన ఎస్.ఎస్. ట్యాంక్ నిర్మాణం. 3. గోరుకల్లు దగ్గర ఉన్న ప్రభుత్వ స్థలంలో 664 కోట్లతో ఎస్.ఎస్.ట్యాంకు నిర్మించి, జగన్నాథ గట్టు మీద ఉన్న ప్రభుత్వ స్థలంలో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ (పంప్ హౌస్) నిర్మాణం. అలాగే వీటిలో ఏదైతే ఆమోదం తెలుపుతారో వాటికి అనుగుణంగా నగరంలో ఈ.ఎల్.ఎస్.ఆర్. ట్యాంకులు నిర్మించి డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ నిర్మించాల్సి ఉంటుందని నివేదిక సమర్పించి ముఖ్యమంత్రికి క్లుప్తంగా మేయర్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement