Tuesday, October 29, 2024

AP : ఎమ్మిగ‌నూరులో టీడీపీలో ఫ్లెక్సీ వార్‌

క‌ర్నూల్‌జిల్లాః కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ లో ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. టీడీపీ ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఉండగా వైసీపీ టికెట్ బీసీ లకు కేటాయించడంతో, టిడిపి కూడా బీసీలకు కేటాయించాలని ఆలోచనలో ఉందని అందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మాచని సోమనాథ్ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నలు చేస్తు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తూ చాలా చోట్ల చంద్రబాబును గెలిపించాలని కోరుతూ సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ మాచాని సోమనాథ్ ఫ్లెక్సీలు ఏర్పటు చేసాడు.

అయితే గోనెగండ్ల మండల కేంద్రంలో సోమనాథ్ వేసిన ఫ్లెక్సీలు అన్నిటిని గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేశారు. దింతో తాము ఎవరు ఎన్ని కుట్రలు పన్నిన తాము మాత్రం టీడీపీ గెలుపుకోసం కృషి చేస్తామని మాచని సోమనాథ్ వర్గీయులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement