Wednesday, December 6, 2023

KNL: ఎమ్మిగనూరులో రైతు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం కనకవీడు గ్రామంలో ఆరెకంటి లింగన్న(64) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

- Advertisement -
   

మృతుడికి భార్య ఎలిషమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. తనకు ఉన్న ఒకటిన్నర ఎకరాల్లో గత మూడు సంవత్సరాలుగా పంటలు సక్రమంగా రాకపోవడంతో బ్యాంకులో రెండు లక్షలు, ఇతరుల దగ్గర మూడు లక్షలు మొత్తం ఐదు లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు, రైతులు, గ్రామస్తులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement