Sunday, April 28, 2024

Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నాం: సోనియా గాంధీ

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు పై లోక్‌సభలో ఇవాళ చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ దీనిపై మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఈ నారీ శక్తి వందన్‌ అభియాన్‌ 2023 బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు పై చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ దీనిపై చర్చను మొదలు పెట్టి ప్రసంగించారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నారీ శక్తి వందన్ అభియాన్ 2023 బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ను కాంగ్రెస్ సమర్థిస్తోందన్నారు. ఇది తనకు చాలా ఉద్వేగభరిత క్షణమన్నారు. ఈ బిల్లును తీసుకురావడంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్వప్నం పూర్తిగా నెరవేరిందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని తన భర్త రాజీవ్ గాంధీ ఆనాడు రాజ్యసభలో బిల్లు తీసుకొచ్చారు. కానీ, అది రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో వీగిపోయిందన్నారు. ఆ తర్వాత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బిల్లును అమల్లోకి తీసుకురాగలిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement