Friday, April 26, 2024

ఆటో చోరీ నిందితుల అరెస్టు.. 14 వాహ‌నాలు స్వాధీనం : ఎస్పీ సిద్ధార్థ కౌశల్

కర్నూల్ : కర్నూల్ నగరంలోని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోల చోరీ నిందితుల నుండి 14 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. 2021 సంవత్సరంలో ఒక కేసు, 2022వ సంవత్సరంలో 12 కేసులు పెండింగ్ ఉండడంతో ఆ కేసుకు సంబంధించి డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో నాలుగో పట్టణ సీఐ శంకరయ్య ఒక టీమ్‌ ఏర్పాటు చేశారు. వీరు ఆదివారం కర్నూలు నగరంలోని వై జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుండి వస్తున్న ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా ప‌ట్టుకున్నారు. వీరు సయ్యద్ సమీర్, మహమ్మద్ అలీలుగా గుర్తించారు. వీరిని విచార‌ణ చేయ‌గా 14 ఆటోలు చోరీ చేసినట్లు నిధులు ఒప్పుకున్నారు. ఒక ఆటోను కర్నూల్ నగరంలోని వెంకటరమణ కాలనీ నందు, మిగిలిన 13 ఆటోలను హైదరాబాదులో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీటి విలువ సుమారు 17 లక్షల 40 వేల రూపాయలు ఉంటుందని తెలియజేశారు. వీరిపై తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో విచారిస్తున్నామని ఎస్పి తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement