Sunday, May 5, 2024

శివరాత్రి ఉత్సవాలకు 1,800 మంది పోలీసులతో బందోబస్తు..

కర్నూలు, ప్రభన్యూస్ : శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 1800మంది పోలీసులను ప్రత్యేకంగా బందోబస్తు నియమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈనెల 22 నుంచి మార్చి 4వ తేది వరకు కొనసాగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా బందోబస్తును నియమించామన్నారు. అడిషినల్‌ ఎస్పీతో పర్యవేక్షిస్తూ 7 మంది డిఎస్పీలను 30మంది సిఐలు, 85మంది ఎస్సైలు, ఎఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, పోలీసు కానిస్టేబుళ్లు, హోమంగార్డులు కలిపి దాదాపు 1500 మందిని నియమిస్తున్నట్లు తెలిపారు.

శ్రీశైలంకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మార్గాలలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 15 ఎల్‌ఈడి టీవిలతో కమాండ్ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకంగా ఒకరిని నియమించి శ్రీశైలం దేవస్థానం నలువైపులా బందోబస్తు నియమిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పోలీసులకు ప్రత్యేకంగా సహకరించాలని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement