Tuesday, April 30, 2024

AP: ఏడాదిలో దుర్గ గుడిలో ఎంతో అభివృద్ధి…ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో): గడిచిన ఏడాది కాలంలో కనకదుర్గమ్మ వారి దేవాలయం శరవేగంగా అభివృద్ధి చెందిందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. భక్తులకు అమ్మవారి శీగ్ర దర్శనం కల్పించడంతోపాటు, వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు.

ట్రస్ట్ బోర్డు ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మహా మండపం ఏడవ అంతస్తులు చైర్మన్ కార్యాలయంలో బుధవారం చైర్మన్ ట్రస్ట్ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఏడాది కాలంలో దుర్గగుడి ని ఎంతగానో అభివృద్ధి చేశామ‌ని, దుర్గా ఘాట్ లో భక్తులకు మునుగు స్నానాలు ఏర్పాటు చేమ‌నితెలిపారు. డ్రెస్ చేంజింగ్ రూమ్స్, లగేజ్ రూమ్స్, వాష్ రూమ్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. భక్తుల కోసం రెండు బస్సులు ఏర్పాటు చేస్తామ‌ని, షిర్డీ తరహాలో భక్తులకు పాకెట్ లో కుంకుమ అందజేస్తున్నామ‌న్నారు.

- Advertisement -

అన్న ప్రసాదాన్ని మెరుగు పరిచామ‌ని, దూర ప్రాంతాల నుంచి రాత్రి వేళల్లో వచ్చే భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నామ‌ని చెప్పారు. సీఎం జగన్ ఇచ్చిన 70 కోట్ల రూపాయలతో ప్రసాదం పోటు ను నిర్మిస్తున్న‌ట్లు చెప్పారు.
శివాలయంను ఈ నెల 18 న ప్రారంభిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. కనకదుర్గా నగర్ నుంచి ఎలివెటెడ్ క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement