Friday, May 3, 2024

నైట్ ఫుడ్ కోర్ట్ పునః ప్రారంభించాలి : బొండా

ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం, బందర్ రోడ్డు నైట్ ఫుడ్ కోర్ట్ ని తిరిగి ప్రారంభించాలని, ఈ ఫుడ్ కోర్టులో 2014 నుంచి వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులు 88మందికి న్యాయం చేస్తూ వారికి గతంలో ఏ విధంగా అయితే వ్యాపారం చేసుకోడానికి అనుమతి ఇచ్చారో ఆ విధంగా వారందరికీ తిరిగి ఇవ్వాలని విజయవాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కోరారు. దీనిపై స్పందించిన‌ మునిసిపల్ కమిషనర్ తక్షణమే దాన్ని పరిశీలించి ప్రారంభించే చర్యలు చేపట్టడంతో పాటు అక్కడ వ్యాపారం చేస్తున్నవారందరికీ కూడా న్యాయం చేస్తామ‌ని బొండా ఉమకు హామీ ఇవ్వడం జరిగింది.. ఈ హామీతో ఈనెల 10వ తేదీ ఆదివారం రాత్రి వ్యాపారులకు అండగా నిలిచి అక్కడ బండ్లు ఏర్పాటు చేస్తామ‌న్న బొండా ఉమ మునిసిపల్ కమిషనర్ ఇచ్చిన హామీతో ఈ పోరాటాన్ని వాయిదా వెయ్యడం జరిగింది..

ఈ సందర్బంగా బొండా ఉమా మాట్లాడుతూ… ఈ నైట్ ఫుడ్ కోర్టులో వ్యాపారం చేస్తున్న వ్యాపారులపైన ఎవరైనా దందాలు చేస్తే సహించేది లేదని వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆనాడు టీడీపీ హయాంలో తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో 2014 డిసెంబర్ 23వ తేదిన విజయవాడ నగరపాలక సంస్థ వారు, పోలిస్ శాఖ వారు సంయుక్తంగా బందరురోడ్డు, ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం ప్రక్కన నగర ప్రజలకు రాత్రి సమయంలో ఒకే చోట ఆహారాన్ని అందించేందుకు, చిరు వ్యాపారులతో నైట్ ఫుడ్ కోర్టును ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా, నియమ నిభంధనల ప్రకారం 2020 మార్చ్ 21వ తేది వరకు కొనసాగిందన్నారు. ఈ నైట్ ఫుడ్ కోర్టులో 88 మంది చిరు వ్యాపారస్తులతో పోలిస్ వారి పర్యవేక్షణలో నిర్వహణ జరిగేదని, ఈ అంశాలను పరిశీలించి నగర ప్రజలకు నైట్ ఫుడ్ కోర్టును అందుబాటులోకి తీసుకువ‌స్తే ఇక్కడ జీవనం సాగించే చిరు వ్యాపారస్తులు గతంలో మాదిరిగా అవకాశం కల్పించి న్యాయం చెయ్యాలని కమిషనర్ ను కోరినట్టు బొండా ఉమా తెలిపారు. కమిషనర్ ను కలిసిన వారిలో బొండా ఉమతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement