Wednesday, May 15, 2024

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి – ఎమ్మెల్సీ మాధవ్

అమరావతి : పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎమ్మెల్సీ మాధవ్ కోరారు. విజయవాడ శాతవాహన కళాశాల ప్రాంగణంలో బీజేపీ నాయకులు కొండముడి బంగారుబాబు బ్యాటరీ ఆటో షోరూం నిర్వహిస్తున్నారు. ఇవాళ‌ ఈ ఆటోలను పరీక్షించి అనంతరం ఆటోను నడిపి చూసారు. అనంతరం మాధవ్ మాట్లాడుతూ… కాలుష్యం మానవాళి మనుగడకు ముప్పుగా మారుతున్న సమయంలో ఈ బ్యాటరీ, ఎలక్ట్రికల్ వాహనాలు ఎంతో మేలుచేస్తాయన్నారు. ఇప్పటికే కేంద్రంలో నరేంద్రమోదీ ఈ వాహనాల తయారీకి ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు.

దేశరాజధాని న్యూ ఢిల్లీలో ఇప్పటికే 60 శాతం కాలుష్య రహిత వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వచ్చే నాలుగేళ్లలో దేశం మొత్తం పర్యావరణ రక్షణకై భాజాపా సంకల్పిస్తుందని అన్నారు. ప్రస్తుతం ముఖ్య నగరాల్లో అనేక మంది స్కూటర్, మోటర్ సైకిల్, కార్లు అనేకమ‌య్యాయని, గతంలో కేవలం ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో మాత్రమే కాలుష్యం వుండేదన్నారు. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికత ద్వారా వాహనాలు రావటంతో జనావాసం మధ్యకు రావటంతో కాలుష్యం అధికమైందన్నారు. ఇప్పుడు ఈ స్కూటర్, బ్యాటరీ ఆటో వల్ల కాలుష్య ప్రభావం తగ్గి మానవాళికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డురి శ్రీరామ్, మువ్వల వెంకట సుబ్బయ్య, ఆల చంద్రశేఖర్ యాదవ్, మాదల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement