Friday, June 2, 2023

సెంట్రింగ్ కార్మికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ – ఒక‌రి మృతి..

విజయవాడ: అజిత్ సింగ్ నగర్‌ పైపుల్ రోడ్ సెంటర్ సమీపంలోని దుర్గా బజార్ సెంటర్లో రోడ్లపై సెంట్రింగ్ కార్మికులు కత్తులతో స్వైర వివాహరం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందారు.. పలువురు గాయ‌ప‌డ్డారు ఘర్షణ చోటు.. మద్యం మత్తులో వంద రూపాయల కోసం కార్మికులు కొట్టుకున్నారు. అనంత‌రం ఒక‌రిపై ఒక‌రు క‌త్తులతో దాడి చేసుకున్నారు..ఈ దాడిలో వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ కార్మికుడు పండు మృతి చెందాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement