Saturday, May 4, 2024

కెసిఆర్ నిర్ణ‌యంతో ఎపిలో పొలిటిక‌ల్ కిక్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అనూహ్య నిర్ణయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వ్యవహరించే బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెె.చంద్రశేఖరరావు అందుకు తగ్గట్లే తాజాగా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తన రాజకీయ వ్యూహానికి కిక్‌ ఇచ్చే స్థాయిలో విశాఖ ఉక్కు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. బిడ్‌లో పాల్గొనాలన్న నిర్ణయంతో ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి నాంధి పలుకాలన్న ఆయన మనోగతాన్ని బహిర్గతం చేయడమే కాకుండా కలిసివచ్చే రాజకీయ పార్టీల మద్ధకు కూడగట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. సమయాను కూలంగా కేసీఆర్‌ తన వ్యూహాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి, జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ ఉనికి దేశవ్యాప్తం చేయాలన్న కోణంలో ముందుకు సాగుతున్నారు. ఈ అనూహ్య నిర్ణయంతో మోడీ సర్కారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి బ్రేకులు పడినట్లేనని రాజకీయ వర్గాలు చర్చించు కుంటున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీ-కరించే విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు ఎంతటి పట్టు-దలతో ఉందన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఏపీ ప్రజల సెంటిమెంట్‌ కమిట్‌మెంట్‌, విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగుల తీరుపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాతే ముందడుగు వేశారు.

దేశంలో ఎవరూ మోడీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటానికి, గళం విప్పటానికి సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్‌ విశాఖ ఉక్కు అంశంతో తెర మీదకు వచ్చారు. తమ నిర్ణయంతో కేంద్రంపై ఒత్తిడిని తీసుకురావటంతో పాటు-.. తెలంగాణలో చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన ఉక్కును సమకూర్చుకోవటానికి సాయంగా మారుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాజకీయంగా ఢీ కొట్టాలన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే సీఎం కేసీఆర్‌ పట్టుదలతో వ్యవహరిస్తారన్న అంశానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా నిలుస్తోంది. తాను ప్లాన్‌ చేసిన దానికి తగ్గట్లే తెలంగాణకు చెందిన అధికారుల బృందాన్ని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిశీలన, అధ్యయనం కోసం అక్కడికి పంపించారు. దీంతో ఏపీలో కూడా కలకలం మొదలైంది. అధికార పార్టీ వైకాపా మంత్రి అమర్నాథ్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల మాట్లాడారు. బిడ్‌లో పాల్గొంటే ప్రయివేటీకరణకు మద్దతు ఇచ్చినట్లేనని మంత్రి అమర్నాథ్‌ పేర్కొనగా, సీఎం జగన్‌ ప్రతిపాదనలనే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చెప్పారని వివరించారు. తాము ప్రయివేటీకరణకు వ్యతిరేకమన్నారు.

సరిగ్గా ఎన్నికల సమయంలో, కేంద్ర సర్కారు ఇబ్బంది పెట్టాలన్న వ్యూహంతో ఉన్న తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన మేధోసంపత్తితో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ విధానాన్ని పరోక్షంగా ప్రకటించి తెలగు రాష్ట్రాల్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. విశాఖ ఉక్కుకు సంబంధించిన పలు అంశాలపై అవగాహనకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు సాయంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యర్థిని ఇరుకున పెట్టాలనుకున్నప్పుడు వారిని ఆత్మరక్షణలో పడేసేందుకు వారి అడ్డాలోకి వెళ్ళే వ్యూహం ఒకటి ఉంటు-ంది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న తాజా నిర్ణయం చూస్తే, ఆ కోవలోకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంతకూ కేసీఆర్‌ ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ దారిని ఎంచుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు వెలుగు చూస్తున్నాయి. విశాఖ కర్మాగారానికి అవసర మైన మూలధనం ముడిసరుకుల కోసం సదరు సంస్థ గత నెలలో ప్రైవేట్‌, ఇతర స్టీల్‌ అనుబంధ రంగాలకు చెందిన కంపెనీలు లేదంటే సంస్థల నుంచి -టె-ండర్లను ఆహ్వానించింది. ఈ నిర్ణయంతో తమకు అనుకూల మైన వారికి అప్పజెప్పాలన్నది కేంద్రంలోని మోడీ సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. అలాంటి వాటిని దెబ్బ తీసేందుకు వీలుగా తాను ఎంట్రీ- ఇవ్వాలన్నది కేసీఆర్‌ ఆలోచనగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటీ-కరణ చేసే మోడీ సర్కారు ఆలోచనకు బ్రేకులు వేసేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించే క్రమంలో ఈ అంశాన్ని ఎంచుకున్నారు.

- Advertisement -

విశాఖ ఉక్కు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని విశాఖ ఉక్కు పోరాట కమిటీ- ఆహ్వానించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీ-కరణకు వ్యతిరేకిస్తు వస్తున్న కేసీఆర్‌ ఇప్పుడు విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో పాల్గొనాలని వారంతా గొప్ప నిర్ణయంగా పరిగణిస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన వెంటనే విశాఖకు వెళ్లి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ- కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బిడ్డింగ్‌ కు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులుగా ఉండాలన్న కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పిన జెఏసీ బహిరంగ సభను నిర్వహించేందుకు మేం సిద్ధం అని పేర్కొంది.

బిడ్‌ ప్రతిపాదనల గడువు 15న మధ్యాహ్నం 3గంటలు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ మంత్రి కేటీ-ఆర్‌ ఇటీ-వల బహిరంగంగానే విమర్శించారు. బీజేపీ అనుకూల కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పేందుకు చేస్తున్న కుట్రలో ఇది తొలి అడుగని దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. మరోవైపు, బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ఇటీ-వల స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కలిశారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ మార్చి 27న యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఈవోఐ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదంటే ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసి ఉండాలి. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటు-ంది. కేసీఆర్‌ తీసుకున్న తాజా నిర్ణయాన్ని బట్టి చూస్తుంటే ఏపీలోని ఉత్తారాంధ్రపై ఎక్కువగా ఫోకస్‌ చేసినట్లు-గా తెలుస్తోంది. సీఎం అదేశాల మేరకు అధికార యంత్రాంగం బిడ్‌ దాఖలుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement