Tuesday, May 21, 2024

Flash: బండి సంజయ్ కి బెయిల్ నిరాకరణ..14 రోజుల రిమాండ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కరీంనగర్ కోర్టులో చుక్కెదురైంది. బండికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించడంతో పాటు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు.

నిన్న(జనవరి 2) రాత్రి కోవిడ్ ఆంక్షలకు విరుద్ధంగా జాగరణ దీక్ష చేపట్టడంతో పాటు పోలీస్ విధులను అడ్డుకోవడంతో బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement