Sunday, April 28, 2024

కరోనా టీకా సురక్షితం – ఖాజీపేట తహశీల్దార్ సూర్యానారాయణరెడ్డి

ఖాజీపేట – కరోనా టీకా చాలా మంచిదని, సురక్షితమని ఖాజీపేట మండల తహసీల్దార్ సూర్యనారాయణరెడ్డి అన్నారు.
శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన కరోనా టీకా రెండవ డోసు వేయించుకున్నారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ 60 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు కరోనా వాక్సిన్ వేయించుకోవాలని, టీకా వేయించుకోవాలనుకొనే వారు తమ ఆధార్ కార్డు గాని లేదా ఏదైనా గుర్తింపు కార్డులు చూపించి టీకా వేయించుకోవాలన్నారు.45 సంవత్సరాలనుండి 59 సంవత్సరాలవరకు వయస్సు ఉన్నవారు బిపి, షుగర్, ఇంకా ఏదైనా దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు వైద్యులు సంతకాలు చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలన్నారు. సెలవు దినాలలో కాకుండా ప్రతి రోజు కరోనా వాక్సిన్ వేస్తామని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ టి. సిల్వియా సాల్మోన్ తెలిపారు. ఏ ఎన్ యం లు ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి అందరు వాక్సిన్ వేయించుకొనేటట్టు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి. సిల్వియా సాల్మోన్ , మండల ఆరోగ్యవిస్తరణ అధికారి యం. రాఘవయ్య, సూపర్ వైజర్ యోగేశ్వరయ్య, కృష్ణప్రియ, ఏ, ఎన్,యం. లు వెంకటసుబ్బమ్మ, మహేశ్వరీ, హేమలత,ఆశా కార్యకర్తలు సునీత,లక్ష్మీదేవి, తహసీల్దార్ కార్యాలయం నుండి చౌడయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement