Saturday, April 27, 2024

జూ.ఎన్టీఆర్ మ‌మ్మ‌ల్ని కంట్రోల్ చేయ‌డమేంటి : కొడాలి నాని

తాజా ప‌రిణామాల‌పై ఏపీ మంత్రి కొడాలి నాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జూ.ఎన్టీఆర్ మ‌మ్మ‌ల్ని కంట్రోల్ చేయ‌డ‌మేంటి.. ఆయ‌న చెప్తే మేమెందుకు వింటామ‌ని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఆయ‌న చెబితే నేను, వంశీ వింటామా అని అన్నారు. ఒక‌ప్పుడు క‌లిసే ఉన్నాం… విభేదాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేశామ‌న్నారు. నంద‌మూరి కుటుంబం అంటే గౌర‌వం ఉంద‌న్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఇంకా చంద్ర‌బాబునే న‌మ్ముతోంద‌న్నారు. ఎన్టీఆర్ కుటుంబం మాట‌లు విని జాలేసింద‌న్నారు. నేను, వంశీ సెక్యూరిటీని వ‌దిలేసి వ‌స్తాం…చంద్ర‌బాబు కూడా సెక్యూరిటీని వ‌దిలేసి రాగ‌ల‌రా అని ప్ర‌శ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement