Saturday, May 4, 2024

Election Manifesto – ‘ప్రతి చేతికీ పని – ప్రతి చేనుకీ నీరు’ లక్ష్యం దిశ‌గా జ‌న‌సేన‌…టిడిపి ఉమ్మ‌డి మేనిఫెస్టోపై చ‌ర్చ‌….

విజ‌య‌వాడ – జనసేన పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ ‘ప్రతి చేతికీ పని – ప్రతి చేనుకీ నీరు’ అనే లక్ష్యం దిశగా సాగింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం విజయవాడలో పార్టీ మేనిఫెస్టో కమిటీతో సమావేశం అయ్యారు. కమిటీ సభ్యులు ముత్తా శశిధర్, డి.వరప్రసాద్, ప్రొఫెసర్ కె.శరత్ కుమార్ ఈ చర్చలో పాల్గొన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల మెరుగుదల, వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలవడం, పేద ప్రజల సంక్షేమం, మహిళా భద్రత, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించిన షణ్ముఖ వ్యూహంలోని అంశాలను ఆధారంగా చేసుకొని రాష్ట్రంలోని ప్రతి వర్గం సంక్షేమాన్నీ దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా నాదెండ్ల కమిటీ సభ్యులకు సూచించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో సమావేశమైనప్పుడు చర్చించిన అంశాలను జనసేన సభ్యులు వివరించారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని, ఇందుకు సంబంధించిన చర్చలు వేగవంతం చేయాలని మనోహర్ కోరారు….

జనసేన మేనిఫెస్టో కమిటీకి వినతులు… సూచనలు
జనసేన మేనిఫెస్టో కమిటీకి వివిధ వర్గాలు, సంఘాల నుంచి వినతులు, సూచనలు అందాయి. వాటిని ఈ సమావేశంలో పరిశీలించారు. కాపు సంక్షేమ సేన తరఫున ఆ సంస్థ వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య పంపించిన పీపుల్స్ మేనిఫెస్టోపై చర్చించారు. జనసేన మేనిఫెస్టో కమిటీని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్, పార్సిల్ లారీ అసోసియేషన్, ట్రాలర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి రవాణా రంగంలోని సంక్షోభాన్ని తెలియచేస్తూ ఈ రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఏపీ నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు తమ సమస్యలను, నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడించి వినతి పత్రం అందచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement