Saturday, April 27, 2024

AP: మూడో రోజుకి చేరిన జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌

పెంచిక‌లపాడు నుంచి రాళ్లదొడ్డి వ‌ర‌కు టూర్
దారి పొడుగునా బారులు తీరిన జనం
వారితో మమేకమ‌వుతు కొనసాగుతున్న యాత్ర
మహిళలు, పిల్లలు, వృద్దులను ఆప్యాయంగా ప‌ల‌క‌రింత
సాయంత్రం ఎమ్మిగనూరులో బహిరంగ సభ

కర్నూల్ బ్యూరో – మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన సీఎం జగన్‌.. శుక్రవారం కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగిస్తున్నారు. దారి పొడవునా జనం తన కోసం ఎదురు చూస్తున్న కొందరు అవ్వా, అక్కాచెల్లెమ్మలను చూసి.. బస్సు దిగి వచ్చి ఆప్యాయంగా పలకరించారు. వాళ్లలో కొందరు సాయం కోరగా.. అందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న అధికారుల్ని ఆదేశించారాయన.

కడప జిల్లా నుంచి మొదలైన ఈ యాత్రకు ఇప్పటికే జనం బ్రహ్మరథం పడుతున్నారు.ఈ యాత్రలో భాగంగా మూడో రోజు పెంచికలపాడు నుంచి మొదలై, రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డికి చేరుకుంది. అక్కడ భోజన విరామం తర్వాత, సీఎం జగన్ ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్‌లో బహిరంగ సభకు బయలుదేరతారు.

ఎమ్మిగ‌నూరులో బ‌హిరంగ స‌భ ..

- Advertisement -

ఇక నేటి సాయంత్రం ఎమ్మిగనూరులో బహిరంగ సభ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్‌ మైదానం బహిరంగ సభకు సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక, పార్లమెంట్ అభ్యర్థి బి వై రామయ్య, సిట్టింగ్ ఎమ్మెల్యేల నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
సీఎం ప్రసంగించేందుకు సభా వేదిక, ప్రజలకు అభివాదం చేసేందుకు ర్యాంప్‌ నిర్మించారు. ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ లైట్ల ఏర్పాట్లు, బ్యారికేడ్ల ఏర్పాటు ప్రక్రియలు పూర్తయ్యాయి. ఈ సభకు లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది దీని దృష్టిలో పెట్టుకొని సభలో కూర్చొనేందుకు వీలుగా లక్షల పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు పర్య వేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement