Thursday, May 2, 2024

Crop Aid – కౌలు రైతుల‌కు పెట్టుబ‌డి సాయం విడుద‌ల చేసిన జ‌గ‌న్

అమరావతి: కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారంనాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్చువల్ గా లబ్దిదారులతో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు కౌలు రైతులకు మొత్తం రూ. 1,122 కోట్లు పంపిణీ చేసినట్టుగా చెప్పారు.1,46,324 మంది కౌలు రైతులకు రూ. 109.74 కోట్ల పెట్టుబడి సహాయం అందిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు తోడుగా ఏపీ ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.సీసీఆర్‌సీ కార్డులు పొంది కౌలు చేసుకుంటున్న రైతులకు తొలి విడత పెట్టుబడి సహాయం అందించినట్టుగా చెప్పారు.వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 52 లక్షల 50వేల మంది రైతులకు మేలు కలుగుతుందని వివరించారు.

ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జూలై మాసంలో కురిసిన వర్షాలకు పంట నష్టానికి సహాయం అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. పంట పెట్టుబడికి రైతులు అప్పులు చేయాల్సిన అవసరం రాకుండా ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు కల్తీలేని విత్తనాలను అందిస్తున్నామన్నారు.ఆర్‌బీకేల ద్వారా ఈక్రాప్ డేటా నమోదు చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు.పంటల భీమా ద్వారా రైతులకు అండగా ఉన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement