Thursday, May 2, 2024

RR: శంకర్ పల్లి మున్సిపాలిటీకి బంగారు భవిష్యత్తు..

శంకర్ పల్లి పట్టణం మున్సిపాలిటీగా మారిన తర్వాత పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని, రాబోయే రోజుల్లో శంక ర్ పల్లి మున్సిపాలిటీ బంగారు భవిష్యత్తు ఉన్నదని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో 45 లక్షల రూపాయల నిధులతో చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ జిమ్ ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ మహానగరానికి అతి దగ్గరలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శంకర్ పల్లి మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందనుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ముందుచూపు కారణంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, గతంలో ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు 100% మార్పు ఉన్నదని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెంది హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా నిలబడబోతున్నదని ఆయన అన్నారు.

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ… మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా కొనసాగుతున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలతో ఈ పట్టణం మరింత ముందుకు వెళ్ళనుందని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement