Friday, May 3, 2024

Buddha Venkanna: బలహీన వర్గాల పార్టీ టీడీపీ.. ఉత్తరాంధ్ర ఇంచార్జి

(ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్)
బడుగు బలహీన వర్గాలకు ఉన్నదనిగా నిలిచేది తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తెలిపారు. 23 సంవత్సరాన్ని విధ్వంసం నామ సంవత్సరంగా వైయస్ జగన్ తయారు చేశారని విమర్శించారు. విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

టికెట్స్ లేవంటే వైసీపీ లో మంత్రులు, ఎమ్మెల్యే లు హ్యాపీ గా వెళ్లిపోతున్నారన్నారు. వైసీపీ బి.ఫామ్ ఎవరికి ఇచ్చిన ఓడిపోతారన్నారు.. టీడిపి జనసేన బి ఫామ్ వొచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే అవుతారన్నారు. ఎలాగో ఒడిపోతారు కాబట్టి జగన్ నిర్ణయాన్ని వాళ్ళ కార్యకర్తలు అంగీకరిస్తున్నారన్నారు.చంద్రబాబు అరెస్ట్ తో 2024 లో టీడీపీ అధికారంలోకి వస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు. 2023 జగన్మోహన్ రెడ్డి విద్వంస నామా సంవత్సరం గా నామకరణం చేశాం అన్నారు. 2024 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం అంటే కొత్త రాష్ట్రము యర్పడినట్టే గా అభిప్రాయపడ్డారు. 1932లో జనవరి 4 గాంధీ అరెస్ట్ ఎలా గుర్తుందో. అలాగే2023 సెప్టెంబర్ 9 చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రంలో ప్రజలకు గుర్తు ఉంటుందన్నారు.

బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని చరిత్రలోనే లిఖించి ఉందన్నారు. ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన బొత్స ఈ రోజు జగన్ ముందు ఎలా ఉన్నాడో చుస్తే బలహీన వర్గాల పరిస్థితి ఎలా వుందో అర్థం అవుతుందన్నారు. బొత్స తో మైకులు లేకుండా మాట్లాడితే బొత్స మొత్తం చెపుతారన్నారు. జెండాను మోసిన వారిని, పార్టీని నమ్ముకున్న వారికి తగిన న్యాయం చంద్రబాబు చేస్తారన్నారు. తెదేపా సీనియర్ నేత నాగురు మీరా మాట్లాడుతూ ఒక నియోజకవర్గం లో పని చేయని వాళ్ళు మరో నియోజకవర్గంలో పని చేస్తారని అనుకోవడం అవివేకం అన్నారు. అంబెడ్కర్ రాజ్యం ఎర్పాటు అవుతుందను, జగన్ అంబెడ్కర్ రాజ్యాంగాన్నీ నాశనం చేసాడన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుండి కాల్ వస్తే ఎమ్మెల్యే లు ఆనందపడుతున్నారన్నారు.టికెట్ ఇస్తే ఒక దండం, ఇవ్వకపోతే పది దండలు అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే లు అని చెప్పారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జగన్ తీరని ద్రోహం చేసాడన్నారు.పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గెలుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement