Friday, April 26, 2024

తాగునీరూ అందించలేని అసమర్థుడు జగన్ : చంద్ర‌బాబు

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో రాష్ట్రం అధ్వాన్న స్థితిలో ఉంద‌ని, ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేని అసమర్థుడు సీఎం జగన్ అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఆయ‌న మాట్లాడుతూ… వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జల్ జీవన్ మిషన్ అమలులో ఏపీ 18వ స్థానంలో ఉందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఎన్నో వైఫల్యాలకు తాగునీటి సమస్య మరో ఉదాహరణ అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement