Thursday, May 9, 2024

అసంతృప్తుల చేతికి స‌రికొత్త ఆయుధం – ‘జగనన్నకు చెబు దాం’

అమరావతి, ఆంధ్రప్రభ : ‘జగనన్నకు చెబు దాం’ అనే కొత్త కార్యక్రమం క్షేత్రస్థాయిలో చాలా మందిని ఉత్తేజ పరుస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పరం గా ఎవరికైనా ఏమైనా సమస్యలుండి, అవి పరిష్కారం కాకపోతే 8296082960 నంబరుకు ఫోన్‌చేసి జగన్‌ మోహన్‌ రెడ్డితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడిది సిట్టింగులు, కో ఆర్డినేటర్లలో గుబులు పుట్టిస్తోం ది. ఒక రకంగా ఇది మంచి పనే అయినా ఇందులో ఉండే ఇబ్బందులను కూడా వారు గమనిస్తున్నారు. తాజాగా అందుతున్న సమా చారం మేరకు ఈ ఫోన్‌ నంబరుకు నియోజక వర్గంలో సిట్టింగులు, లేదా కో ఆర్డినేటర్లకు దూరంగా ఉంటూ వస్తున్న పార్టీ కేడర్‌ (అసం తృప్తివాదులు) ఫోన్‌చేసి నియోజకవర్గ పరిస్థితు లు, ఎమ్మెల్యే లేదా కో ఆర్డినేటర్‌ అవలంభిస్తున్న తీరుతెన్నులను నేరుగా సీఎంకు చెబితే పరిస్థితు లేంటని సిట్టింగుల్లో ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తోంది. అయితే, ఇది ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ అని, ఫిర్యాదు దారుడు చెప్పిన మాటలు రికార్డు అవు తాయని, తరువాత దీనిని శాఖల వారీగా పంపే ప్రయత్నం చేస్తారు తప్ప ఇందులో రాజకీయ ఫిర్యాదులకు అవకాశం లేదని కొంత మంది వాదిస్తున్నారు. వీటన్నింటి నడుమ నియోజక వర్గాల్లో అసంతృప్తి వాదులు మాత్రం ఏదైతే అదే అవుతుంది. మనకు జరిగిన అన్యాయాన్ని మాత్రం జగనన్నకు కచ్చితంగా చెప్పి తీరుదామంటూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇండివిడ్యువల్‌ గ్రీనెన్సెసెస్‌ను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా రేషన్‌ కార్డు స్ప్లిట్‌ కాకపోవడం వంటి సమస్యలు గ్రామంలో ఒకటి అరా ఉంటే వాటిని కూడా మిస్‌ కాకూడదని ఇండివిడ్యువల్‌ గ్రీవెన్స్‌సెస్‌ను పరిష్కరించడానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈనెల 13న ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఎప్పటి నుండో తమ అభిమాన నేతకు తమ సమస్యలను తెలియజేయాలని తహతహలాడుతున్న కేడర్‌కు ఇది ఒక అవకాశంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ సీఎంను కలిపే పరిస్థితులు ఎవరికీ దక్కలేదు. అధికారంలోకి రాకముందు మాత్రం తమ ప్రాంతం వచ్చినప్పుడో లేదా మరే సందర్భంలోనో జగన్‌ను నేరుగా కలిసిన అనేక మందికి ఇది ఒక మంచి అవకాశంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అది నుండి పార్టీ జెండా మోసి పార్టీకి పనిచేసిన వారిలో చాలా మంది ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. వీరంతా స్థానిక ఎమ్మెల్యే, కో ఆర్డినేటర్‌తో విబేధించి దూరంగా ఉంటూ జగన్‌ మోహన్‌ రెడ్డి అనే వ్యక్తికోసం పనిచేస్తున్నారు. గడచిన నాలుగేళ్లుగా వారు అధికారానికి దూరంగా ఉంటూ సొంత పార్టీలోనే గుర్తింపు లేకుండా పోయిందని మదన పడుతున్నారు. ఇప్పుడు వీరంతా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు చెబుదామని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ అయినా పర్వాలేదు
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన నెంబరు ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ నంబర్‌ అని చెబుతున్నారు. అయితే, అసంతృప్తి వాదులు మాత్రం అయినా సరే అంటున్నారు. తమకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులకునేది లేదని, ఐవీఆర్‌ఎస్‌ కాల్‌లో రికార్డు అయిన సందేశాన్ని అయినా తమ అభిమాన నేత వింటారు కదా .. అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. తామేమీ పార్టీకి వ్యతిరేకం కాదని, స్థానికంగా తమకు ప్రాధాన్యతను ఇవ్వకుండా వేరే పార్టీ నుండి వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తూ తమను అవమానిస్తున్నారన్నది మాత్రమే తాము అధినేతకు చెబుతామని అనేక మంది అంటున్నారు. కొంత మంది తమపై అక్రమ కేసులు పెట్టిన విధానాన్ని కూడా అధినేతకు తెలియజేస్తామని వాపోతున్నారు. ఇలా పలు రకాల సమస్యలతో ఆదినుండి పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారంతా ప్రస్తుతం స్థబ్దుగా ఉంటూ వస్తున్నారు. వీరందరికీ జగనన్నకు చెబుదాం .. ఒక వేదికగా మారిందని స్పష్టమౌతోంది.

సిట్టింగులకు తలనొప్పి
ఈ విధంగా పార్టీలో అసంతృప్తులు ధిక్కార స్వరం వినిపించేందుకు సిద్ధమౌతుండటం సిట్టింగులకు తలనొప్పిగా పరిణమిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకుతుందని, అది తమకు సానుకూలంగా మారుతుందని ఆశపడ్డామని, ఇప్పుడు కొత్త సమస్య వచ్చినట్లైందని కొంత మంది సిట్టింగులు వాపోతున్నారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ అయినా, నేరుగా సీఎం మాట్లాడినా కేవలం సమస్య మీద మాత్రమే పరిమితమైతే తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, అలా కాకుండా లేనిపోనివి తమపై సీఎంకు చెబితే పరిస్థితి ఏంటని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ను కలుపుకుపోవాలని గడచిన నాలగేళ్లుగా అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి పదే పదే చెబుతూ వస్తున్నారని పార్టీకి చెందిన సీనియర్‌ఒ నేత ఒకరు చెప్పారు. పార్టీకి అదినుండి పనిచేసిన కేడర్‌ను కలుపుకుపోవడం సిట్టింగుల బాధ్యతలో భాగమేనని చెప్పారు. జగనన్నకు చెబుదాం ద్వారా అసంతృప్తుల ఫిర్యాదులపై మాత్రం ఆయన స్పందించేందుకు నిరాకరించారు. మొత్తంగా చూస్తే జగన్నకు చెబుదాం .. సిట్టింగుల్లో గుబులు రేపుతోందనడంలో మాత్రం సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement