Friday, February 3, 2023

దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ దాడులు.. ఇంటి ముందు అనుచ‌రుల ఆందోళ‌న

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే వైసీపీ నేతలు దేవినేని అవినాష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్లలో ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీ రామ్ బిల్డర్స్ పై తనిఖీల్లో భాగంగానే వైసీపీ నేతల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దేవినేని అనుచరులు మాత్రం దాడులకు వ్యతిరేకంగా ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కక్షపూరితంగానే అవినాష్ ఇంటిపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐటీ అధికారులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement