Friday, May 10, 2024

ఆగస్టు 3నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ

అమరావతి, ఆంధ్రప్రభ: ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇంటర్‌ మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ఆగస్టు 3న సెకండ్‌ లాంగ్వేజ్‌, 4న ఇంగ్లీసు, 5న మాథ్స్‌ 1ఎ, 2ఎ, బోటనీ, సివిక్స్‌, 6న మాథ్స్‌ 1బి, 2బి, జువాలజీ, హిస్టరీ, 8న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, 10న కెమిస్ట్రీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌, 11న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, లాజిక్‌, బ్రిడ్జికోర్స్‌ మాథ్స్‌(బీపీసీ విద్యార్థులకు), 12న మోడరన్‌ లాంగ్వేజ్‌, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని 19వ తేదీ మినహా ఆగస్టు 17 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎథిక్స్‌, మాన విలువలపై 24వ తేదీ ఒకేరోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ 26న నిర్వహిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement