Monday, May 20, 2024

అనంత ఫలితాల నొసగే అక్షయ తృతీయ

అక్షయం అంటే క్షయం లేనిదీ.. వృద్ధి చెందు తూనే ఉండేదీ అనే అర్థాలున్నాయి. అం తులేని శుభఫలితాలనిచ్చే రోజుగా అక్ష య తృతీయను భావిస్తారు. ఈరోజు చేసే దాన ధర్మాలైనా, పూజలూ పునస్కారాలైనా అ నంత శుభాలనొసగుతాయన్నది వేదోక్తి. భగవంతుడి కరుణ పుడమినంతా తడిపి వేసే అపార జలధారలాంటిదనుకుంటే- ఈ జలం ఒక్కోచోట విశేష గుణాలు కలిగి న తీర్థమై ప్రవహస్తుంది. ప్రతి చుక్కా గొంతు తడిపేదే అయినా తీర్థానికున్న ప్రత్యేకత వేరు. అలాగే ప్రతి రోజూ విలువైన దే అయినా కొన్ని రోజులు విశిష్టమైనవిగా పేరొందుతాయి. ఆ రోజున గతంలో జరిగిన ఉత్తమ శుభాలే ఆ పవిత్రతను తెచ్చిపెడతాయి. అలాంటి విశిష్ట పర్వదినాల్లో అక్షయ తృతీయ కూ డా ఒకటి. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ అని పిలుస్తారు. శివుడిని ప్రార్థించి కుబేరుడు సంపదకు రక్షకుడిగా నియమితుడైన రోజూ, విష్ణుమూర్తి మహాలక్ష్మిని మనువాడిన పర్వదిన మూ కూడా ఇదే. ఈ రోజు లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని భక్తుల నమ్మిక. ఈరోజు చేసే యజ్ఞ యాగాది క్రతువులూ, పూజలూ, జపాలూ అక్షయమైన ఫలితాలని స్తాయని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం వివరిస్తోంది. అక్షయ తృతీయనాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాలనిస్తాయని నార ద పురాణం పేర్కొంటోంది. అందుకే ఈ శుభదినాన ఏ పనిచేసినా అది విజ యవంతం అవుతుందని చెబుతారు. అలాగే ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జాలుండవు. ఈ తిథి రోజు ఏ క్షణంలోనైనా శుభకార్యాలను చేసుకోవ చ్చు. త్రేతాయుగం మొదలైంది అక్షయ తృతీయ రోజేనని పురాణాలు చెబు తున్నాయి. విష్ణు స్వరూపుడయిన పరశురాముడు ఈరోజే జన్మించాడట.
ద్వాపర యుగంలోనూ ఈ రోజుకి విశిష్ట స్థా నముంది. శ్రీకృష్ణుడి అన్న బలరాముడి జన్మది నం అక్షయ తృతీయే. అరణ్యవాసంలో ఉన్న ప్పుడు పాండవులకు కృష్ణుడు అక్షయ పాత్రను ఈ రోజే ఇచ్చాడట. తన చిన్ననాటి స్నేహతుడు కుచేలు డు గుప్పెడు అటుకులు ఇచ్చినందుకే నందనంద నుడు ఆయనకు అష్టై శ్వర్యాలనూ ప్రసా దించింది కూడా ఈ పర్వదినానే నట. నీవే దిక్కంటూ రెండు చేతులూ పైకెత్తి మొక్కిన ద్రౌ పదికి అక్షయంగా చీరలు ఇచ్చిందీ ఈ రోజే. వేదవ్యాసుడు భారతాన్ని రా యడం ప్రారంభించిందీ, భగీరథుని వేడుకోలు తో శివుని జటాజూటం నుంచీ గంగ నేలను చేరిందీ ఈనాడేనట. శివుడి వాహనమైన నం ది పుట్టిందీ ఈ రోజే కావడంతో ‘బసవ జయం తి’నీ జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని సు ప్రసిద్ధ నారసిం#హ క్షేత్రం సింహాచలంలో స్వా మి నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే భక్తులకు లభిస్తుంది. మిగతా ఏడాదం తా స్వామిని చందనపు పూతతో కప్పివేస్తారు. ప్రముఖ శైవక్షేత్రం బదరీనాథ్‌ ఆలయాన్ని చలికాలం తర్వాత ఈ రోజే తిరిగి తెరుస్తారు.
మహాశివుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రత విధా నాన్ని వివరించాడు. అనంత ఫలితాలనొసగే మహావిష్ణువే ఈ వ్రతా నికి అధినాయకుడు. దీని ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటుస్నానం చేసి, విష్ణుమూర్తిని పూజించి, అక్షతలు తలమీద వేసు కుని, శక్తిమేర దాన ధర్మాలు చేయాలి. కొంతమంది ఈరోజు ‘వైశాఖ పూజ’ చేస్తారు. మజ్జి గ, పాన కం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, బట్టలు, గంధం తదితరాలను దానం చేస్తారు. ఎండలతో మండిపోయే వైశాఖ మా సంలో ఇలాంటి పుణ్య దినాన ఎవరి గొంతు చల్లబరచినా, ఎవరికి కాస్త దా నం చేసినా ఆ ఫలితం అక్షయమవుతుందన్నమాట. ఈ రోజున పితృదేవ తలకు తర్పణాలు వదిలే సంప్రదాయమూ ఉంది. అలా చేస్తే పితృదేవతల కు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందంటారు. నిం డు మనసుతో చేసే ప్రతి మంచిపనీ అక్షయమ వ్వాలన్నదే అక్షయ తృతీయ ఇచ్చే ఆశీర్వాదం.

Advertisement

తాజా వార్తలు

Advertisement