Sunday, April 28, 2024

నీటి నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తిచేసే పరికరం.. బెంగాల్‌లోని స్టార్టప్‌ ఆవిష్కరణ

పశ్చిమ బెంగాల్‌లోని ఓ స్టార్టప్‌ స్విచ్‌పై నొక్కడం ద్వారా నీటి నుండి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే పరికరాన్ని విడుదల చేసిందని టెక్నాలజీ వ్యవస్థాపకులు పేర్కొన్నారు. ఇక్కడి వెబెల్‌- బిసిసి అండ్‌ ఐటెక్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లోని సోలైర్‌ ఇనిషియేటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసిన ‘ఓఎమ్‌ రెడాక్స్‌’ పరికరం నీటి నుండి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తుందని వారు తెలిపారు.
ఈ మెషిన్‌ ”సాధారణంగా కాన్సంట్రేటర్‌ నుండి పొందే ఆక్సిజన్‌ కంటే 3.5 రెట్లు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే లోతైన విజ్ఞాన ఆవిష్కరణ” అని స్టార్టప్‌ వెంచర్‌ కోఫౌండర్లు డాక్టర్‌ సౌమ్యజిత్‌ రాయ్‌, అతని భార్య డాక్టర్‌ పీ లియాంగ్‌ పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ఈ పరికరాన్ని బయోటెక్‌ ఎక్స్‌పో 2022లో ప్రదర్శించడానికి, లాంచ్‌ చేయడానికి ఎంపిక చేసింది. 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ విడుదల చేసిన పుస్తకంలో ఈ యంత్రం కూడా ఉంది.

”ఈ సాంకేతికత పేటెంట్‌ పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్‌ కన్ఫర్మిటీచే ఆమోదించబడింది,” అని వారు పేర్కొన్నారు. ఈ పరికరానికి లైసెన్స్‌, దాని తయారీ, మార్కెటింగ్‌ కోసం శాస్త్రవేత్త జంట వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. ఈ పరికరం ఒక అందమైన తెల్లటి పైన్‌వుడ్‌ బాక్స్‌లో వుంటుంది. దీని బరువు 8 కిలోలు ఉంటుంది, ఇది స్విచ్‌ను నొక్కినప్పుడు ఆక్సిజన్‌ను అందిస్తుంది. విద్యుత్‌తో నడుస్తుంది. 3.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో కూడా నడుస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement