Monday, April 29, 2024

Indrakeeladri – కనకదుర్గమ్మ కు గాజుల హారం.. సువర్ణ కాంతులతో మెరుస్తున్న దుర్గమ్మ..

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో – పంచరంగుల గాజుల మధ్య పసిడి కాంతులు లీలుతున్న కనకదుర్గమ్మ భక్తులకు తన్మయత్నం చెందేలా దర్శనమిచ్చారు. సౌభాగ్య ప్రదాయినిగా విరాజిల్లే దుర్గమ్మకు గాజుల మహోత్సవాన్ని సోభయ మానంగా నిర్వహించే గాజుల మహోత్సవాన్ని ఇంద్రకీలాద్రిపై బుధవారం అట్టహాసంగా నిర్వహించగా అమ్మవారిని కనులారా తనివి తీరా దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి మూలవిరాట్ తో పాటు అంతరాలయం, గర్భగుడి, ప్రధాన ఆలయ ప్రాంగణం, ఉపాలయాలు ఇలా ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి ప్రదేశంలో సుందరమైన గాజులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహా మండపంలోని ఆరవంతస్తులో ఉత్సవ విగ్రహాలను సైతం రంగురంగుల గాజులతో అలంకరించారు.

2016 నుండి నిర్వహిస్తున్న ఈ గాజుల పండుగకు ఈ ఏడాది భక్తుల సుమారు 5 లక్షలకు వరకు గాజులను దేవాలయానికి బహూకరించారు. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన గాజులను సమర్పించడం ద్వారా అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు, కేఎస్ రామారావు తీసుకున్న ప్రత్యేక చరవతో భక్తులతో పాటు ఆలయ అధికారులు సిబ్బంది ఈ ఏడాది పెద్ద ఎత్తున గాజులను విరాళంగా అందజేశారు. అలంకరణ అనంతరం భక్తులకు ఈ గాజులను ఉచితంగా అధికారులు పంచిపెట్టనున్నారు. అంగరంగ వైభవంగా అమ్మవారికి గాజుల మహోత్సవం నిర్వహించడం పట్ల భక్తుల నుండి పెద్ద ఎత్తున అభినందనలు, ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement