Wednesday, May 8, 2024

India: చేపలవేటకు స్పెషల్‌ ప్యాకేజీ.. మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మత్స్యకారులందరికీ త్వర లోనే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌లు జారీ చేస్తామని, చేపల వేటద్వారా మత్స్యకారుల అర్జనను గణనీయంగా పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు రూపొందిస్తోందని, చేపలవేట కార్య కలాపాలకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం స్వయం సమృద్ధ భారత్‌ ప్యాకేజీ కింద రూ.20,000 కోట్లను కేంద్రం కేటాయిం చిందని కేంద్ర పశు,మత్స్య శాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ తెలిపారు. 

ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ)ను సందర్శించారు. ఈ సంద ర్భంగా 'ఎన్‌ ఎఫ్‌డీబీ' ఆర్థిక సహాయంతో చేపట్టి, అమలు చేస్తున్న కొన్ని కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు- సంస్థ కార్య కలాపాలను సమీక్షించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర నిధులతో ల్యాండింగ్‌ సెంటర్లు, ఫిషింగ్‌ హార్బర్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు-, కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాల అభివృద్ధి, ఆధునికీకరణకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. దేశీయంగా చేపలవేటకు మద్దతిస్తూ అత్యాధునిక పద్ధతు లను ప్రోత్సహిస్తున్నామని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద ప్రతిపాదించిన వివిధ పథకాల ద్వారా మత్స్య ఎగుమతులను పెంచనున్నా మని మంత్రి వెల్లడించారు.


భవిష్యత్‌లో డ్రోన్లదే కీలకపాత్ర..
కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో కేటాయించిన మేరకు కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, పారాదీప్‌ సహా ఐదు చోట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే ఫిషింగ్‌ హార్బర్లకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు- తెలిపారు. ఇళ్లకు వస్తువుల చేరవేత, అత్యవసర సమయాల్లో సహాయం, శాంతిభద్రతల పరిరక్షణ సహా రవాణా రంగంలో మానవరహిత సూక్ష్మ విమానాల (డ్రోన్‌) వినియోగానికి భారత్‌ కృషి చేస్తోందన్నారు. 

భవిష్యత్తులో డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషించనుందని మంత్రి అన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు బీహార్‌లో అత్యంత భారీ మంచినీటి రొయ్య పిల్లల అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రానికి సంబంధించి 'ఎన్‌ఎఫ్‌డీబీ' నిధులతో డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ 'కాలేజ్‌ ఆఫ్‌ ఫిషరీస్‌' ఏర్పాటు- చేసిన హేచరీని మంత్రి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement